Tuesday 9 June 2015

తెలంగాణా ఏ.సి.బి A యాంటి C చంద్ర B బాబు వలె మారిపోయిందా?

జరుగుతున్న పరిణామాలు చూస్తే తెలంగాణా ఏ.సి.బి A యాంటి C చంద్ర B బాబు వలె మారిపోయిందా అనిపిస్తుంది. తెలంగాణా ఏ.సి.బి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.


1) చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ టాపింగ్ చేయమని ఎవరు ఆదేశించారు? అంత తీవ్రమైన నేరం ఆయన ఏమి చేసాడు? 


2) ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఫోన్ కాల్స్ టాపింగ్ చేయటానికి కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకున్నారా? ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల వ్యక్తిగత సంభాషణల పై నిఘా నైతికమేనా? 

3) చంద్రబాబు నాయుడు స్టీఫెన్ తో సంభాషణల టేపులు న్యాయస్థానానికి సమర్పించకముందే కొన్ని చానళ్ళు ( తెలంగాణా న్యూస్, సాక్షి ) ప్రసారం చేసాయి.... ఆ టేపులు మీరే వారికి అందించారా, లేక ప్రభుత్వ పెద్దల నిర్వాహకమా? ఒకవేళ ఈ రెండిటిలో ఏది నిజమైనా మీ పాత్ర అనేక సందేహాలకు తావిస్తుంది.

4) గత సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రుల కార్యాలయాల్లో ఎన్నో అనైతిక కార్యకలాపాలు సాగుతున్నాయి... ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులను ప్రలోభాలకు గురిచేస్తున్నపుడు, వాళ్ళని సంతలో పశువుల్లా కొనుగోలు చేసినప్పుడు మీ దృష్టికి రాలేదా! లేక వచ్చినా ఈ విషయంలో ముఖ్యమంత్రి అవినీతికి మీరేమన్న లైసెన్స్ ఇచ్చేసారా? 

5) కౌన్సిల్ ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని ప్రలోభాలకు గురిచేస్తూ  ప్రతిపక్ష ఎమ్మెల్యే లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి, హరీష్, కేటిఆర్ కార్యాలయాలనుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు స్పందించి మీరేమైనా ఆ విషయంపై ద్రుష్టి పెట్టారా? మీది స్వతంత్ర వ్యవస్థా లేక ప్రభుత్వ కట్టు బానిస వ్యవస్థా? 

6) తమ పార్టీ ప్రజా ప్రతినిధులను తెరాస, కెసిఆర్ కొనుగోలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించినప్పుడు మీరు నిజానిజాల కోసం ఆ ప్రజా ప్రజాప్రతినిధుల కాల్ డేటా విశ్లేషించారా, వాళ్ళ బ్యాంకు ఖాతాలు, ఇళ్ళలో ఆధారాలకోసం శోధించారా?

7) అవినీతి ఆరోపణల్లో అడ్డంగా బుక్కైన 'శ్రీనివాస్ గౌడ్' లాంటి వారికి కెసిఆర్ పదవిచ్చి అందలాలేక్కిన్చినప్పుడు ఆ చర్యకు మీరేమైనా అభ్యంతరం తెలిపారా? 

8) 16 కేసుల్లో A1 నిందితుడు జగన్ రోజువారి చర్యలపై నిఘా ఏమైనా పెట్టారా? అరాచకవాదులు అసదుద్దీన్ ఒవైసి, అక్బరుద్దిన్ ఒవైసి వంటి వారిపై నిఘా ఏమైనా ఉందా? 
9) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ను తమ పార్టీకి ఓటు వేయమని అడగటం నేరమా? ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ వారు ఇతర పార్టీల వారిని, ఇండిపెండెంట్ అభ్యర్ధులను ఓటు అడగకూడదని రూలేమైనా ఉందా? 

10) చంద్రబాబు నాయుడు, స్టీఫెన్ సంభాషణల్లో ఎక్కడా డబ్బుల ప్రసక్తి రాలేదు, ప్రలోభాలకు గురిచేయలేదు, స్వేచ్చగా, నిర్భయంగా ఓటు వేయమని చెప్పటం నేరమా?


* * * తెలంగాణా ఏ.సి.బి A యాంటి C చంద్ర B బాబు వలె మారిపోయిందని, ఆంధ్ర ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తూ, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుందని ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు... తెలంగాణా ముఖ్యమంత్రి కనుసన్నల్లో పనిచేస్తూ ఈ విధంగా  ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా ప్రవర్తించటం మీకు భావ్యమేనా? 

No comments:

Post a Comment