Tuesday, 12 May 2015

ప్రవాస ముఖ్యమంత్రి.

ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంవత్సర కాలంగా ప్రవాస ముఖ్యమంత్రి వలెనె పరిపాలన సాగిస్తున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రి, అధికారులు తాత్కాలికంగానైనా విజయవాడ లేదా గుంటూరు నుండే పరిపాలన సాగిస్తామని, భవంతులు లభ్యం కాని పక్షంలో చెట్ల క్రింది నుండైనా పరిపాలన సాగిస్తామని చెప్పారు. కాని వాస్తవంలో ఈ సంవత్సర కాలంలో కొత్త రాష్ట్రంలో కనీసం ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసు కాని, కనీసం తాత్కాలిక సచివాలయం కూడా ఏర్పాటు కాలేదు.

ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 65లో ఉన్న చంద్రబాబు నాయుడి ఇంటి  స్థానంలో విశాలమైన కొత్త భవనం నిర్మించనున్నారు. ఆ కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు చంద్రబాబు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 24లో గల అద్దె ఇంట్లో ఉంటారు. దీన్ని బట్టి చూస్తే మనకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ వదిలి కొత్త రాష్ట్రానికి వచ్చే ఉద్దేశం లేదని అర్ధం అవుతుంది. కొత్త రాష్ట్ర రాజధానిలో కనీసం క్యాంపు ఆఫీసు కాని, తాత్కాలిక సచివాలయం కాని, సొంత ఇల్లు కాని నిర్మించుకోకుండా హైదరాబాద్ ఇంటినే విశాలంగా నిర్మించుకోవటం చూస్తే, వీలైనంత కాలం ఈయన ప్రవాస ముఖ్యమంత్రి లానే పరిపాలన కొనసాగించాలని చూస్తున్నారని అర్ధం అవుతుంది. మిగిలిన మంత్రులు, ప్రభుత్వ అధికారులు ముఖ్యమంత్రి చూపిన బాటలోనే నడుస్తూ ప్రవాస ప్రభుత్వం నడుపుతున్నారు.

ఈ ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణం పై కాని, ప్రభుత్వ పాలనపై కాని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు విశ్వాసం కలిగించలేక పోతున్నాడు. మీ "మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు గడప కూడా దాటటం లేదు" గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ!
  

No comments:

Post a Comment