Monday 21 September 2015

నవ్యాంధ్ర టాకీస్ సమర్పించు 'శనిగాళ్ళు'



సోనియా గాంధీ కుళ్ళు, కుతంత్రాలు, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ పార్టీ కొజ్జా ప్రజా ప్రతినిధుల అసమర్ధత కారణంగా   ఏక పక్ష నిర్ణయంతో రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కు అన్ని రంగాల్లో తీరని అన్యాయం జరిగింది. వనరుల కొరత, రెవిన్యూ లోటు, రాజధాని పునర్నిర్మాణం వంటి అనేక విషయాలలో ఆంధ్ర ప్రదేశ్ అనాధగా మిగలి పోయింది. అస్థిపంజరంలా మారిన నవ్యాంద్రకు జీవం పోసే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకుని కేంద్ర ప్రభుత్వ సహాయంతో, రాష్ట్ర ప్రజల మద్దతుతో అహర్నిశలు, అహోరాత్రం కృషి చేస్తూనే ఉన్నాడు. 

కొత్త రాష్ట్రంలో ఇప్పటికే IIT, IIM, NID, AIMS  వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రపంచ ప్రముఖ విద్యాలయాలైనటువంటి కేంబ్రిడ్జ్ మొదలైన విద్యాలయాలతో పాటు టాటా, బిర్లాలు, విప్రో వంటి దిగ్గజాలు ఈ రాష్ట్రంలో విద్యాలయాలు స్థాపించటానికి ముందుకు వచ్చారు. ఇప్పటికే విద్యా రంగంలో ముందున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో దేశంలోనే ముఖ్యమైన 'ఎడ్యుకేషన్ హబ్' గా మారే అవకాశం ఉంది.  


ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. ఎందరో విదేశి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు స్థాపించటానికి ముందుకు వస్తున్నారు. వెనుకబడిన జిల్లాలైన అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో అనేక పరిశ్రమలు వచ్చాయి, ఉత్తరాంధ్రకు కూడా ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. పర్యాటక, ఆతిధ్య రంగంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ భారత దేశంలోనే అగ్ర స్థానం ఆక్రమించబోతుంది. ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన వ్యాపార అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. భవిష్యత్తులో పరిశ్రమలు తరలి రావటానికి ఇదొక అనుకూల అంశం.


విజయవాడ, గుంటూరు పట్టణాల మధ్య కృష్ణా నదీ తీరాన్ని అనుకుని అత్యంత అధునాతన, సుందరమైన రాజధాని నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. విజయవాడ, వైజాగ్ కు మెట్రో రైలు రాబోతుంది, విజయవాడ, వైజాగ్, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానశ్రయాలుగా రూపు దిద్దుకోబోతున్నాయి. కొత్తగా బందరు, ప్రకాశం జిల్లాలో పోర్టులు రాబోతున్నాయి, కోస్తా తీరం పరిశ్రమలకు నిలయంగా మారనుంది.


నదుల అనుసంధానం కార్యక్రమంతో సముద్రంలో కలిసే వృధా అయ్యే నీరును దారి మళ్ళించి కరువు సీమ రాయలసీమకు తరలించే కార్యక్రమం నిజంగా 'భగీరథ ప్రయత్నమే'. రాయలసీమకు సాగు, తాగు నీరందించే ఈ ప్రయత్నాన్ని కూడా రాయలసీమకు చెందిన ఫ్యాక్షన్ రాజకీయ నాయకులు ఓర్వలెక పోతున్నారు. 


ఇంత అభివృద్ధి జరుగుతున్నా జగన్, రఘువీరారెడ్డి లాంటి ప్రతిపక్ష నాయకులు, కమ్యూనిస్టులు, లోకసత్తా నేత జయప్రకాశ్ నారాయణ లాంటి కొందరు కుళ్లుమోతు వెధవలు తమ దృష్టి లోపంతో చూడలేక పోతున్నారు. రాజధాని ఇడుపులపాయ లోనో, దొనకొండలోనో తప్ప అమరావతిలో రావటం ఇష్టం లేని సైకో జగన్ ఇక్కడ కేవలం రెండు, మూడు గ్రామాల్లోని ప్రజలను కులపరంగా రెచ్చగొట్టి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవటమో లేక తాత్కాలికంగా అడ్డంకులు సృష్టించటమో చేయాలని చూస్తున్నాడు. పారిశ్రామీకరణ జరగాలంటే భూముల సేకరణ తప్పనిసరి, పరిశ్రమలు ఏర్పడితే ఆ ప్రదేశంలో భూముల ధరలు పెరుగుతాయి, అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. హైదరాబాద్ వంటి పట్టణం పరిశ్రమలు, ఉపాధి అవకాశాల ద్వారానే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారిని ఆకర్షించగలిగింది అనేది అందరికి తెలిసిందే. బందరు పోర్టుకు, పారిశ్రామిక వాడకు భూములివ్వకుండా అక్కడి ప్రజలను జగన్, రఘువీరారెడ్డి మొదలైన లుచ్చా రాజకీయ నాయకులు అక్కడ ఆందోళనలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. 


జగన్, రఘువీరారెడ్డి, రాఘవులు, నారాయణ, జయప్రకాశ్ నారాయణ్ వంటి కుళ్ళు రాజకీయవేత్తలు  చంద్రబాబు నాయుడు పైన వ్యక్తిగత ద్వేషం, తెలుగుదేశం పార్టీపై అసూయతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆ ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని, తెలుగుదేశం పార్టీ బలపడితే తమకు పుట్టగతులు ఉండవని కేవలం గుడ్డి వ్యతిరేకతతో, చంద్రబాబు నాయుడుపై, తెలుగుదేశం ప్రభుత్వం పై పచ్చి రాజకీయ విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం కలిగిన ఏ సందర్భంలోనూ ఆనందపడలేదు సరికదా వీళ్ళకేదో నష్టం కలిగినట్లు ఏడుస్తున్నారు. ఆంధ్ర ప్రజలు నష్టపోయినా పర్వాలేదు కాని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఆ ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళ ప్రవర్తన సైకోగాళ్ళను తలపిస్తుంది.


"మంచి మాట్లాడకు, మంచి వినకు, మంచి  చూడకు" అనే మూడు చెడ్డ  కోతుల్లా 'జగన్', 'రఘువీరారెడ్డి', 'జయప్రకాశ్ నారాయణ్' ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు  ఆంధ్రా ద్రోహులు, ఆంధ్రకు పట్టిన శనిగాళ్ళు. ఈ కుళ్లుమోతు వెధవల ఏడ్పులే చంద్రబాబు నాయుడుకు, ఆంధ్ర ప్రజలకు శ్రీరామరక్ష. వీళ్ళు ఎంతగా ఏడ్చినా, అరచి మొత్తుకున్నా ప్రజలు వీళ్ళ కల్లబొల్లి మాటలు వినే పరిస్థితిలో లేరు, నవ్యాంద్ర నిర్మాణాన్ని వీళ్ళు ఏమాత్రం అడ్డుకోలేరు. 

No comments:

Post a Comment