Friday 25 September 2015

జగన్ రామోజీని ఎందుకు కలిసాడంటే!

కొద్ది రోజుల క్రితం జగన్ రామోజీని కలవటం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇక్కడ విషయమేమిటంటే ఇద్దరూ ఏదైనా ఫంక్షన్లో కాకతాళీయంగా కలవలేదు లేదా రామోజీ రావు జగన్ ను కలవలేదు, జగనే స్వయంగా రామోజీరావు ఇంటికి వెళ్లి కలిశాడు. రామోజీ రావు తెలివికల వ్యాపారవేత్త, తాము అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని నాగళ్ళతో దున్నిస్తామని ప్రకటించిన కెసిఆర్ నే బుట్టలో వేసుకుని రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అద్భుతం అని, తెలంగాణా రాష్ట్రానికే మకుటాయమానం అని, స్టూడియో కు అన్ని రకాల సహాయం అందించటానికి తాము సిద్ధంగా ఉన్నానని కితాబు ఇప్పించుకున్న ఘనుడు. శత్రువునైనా ఏదోరకంగా  తనదారిలోకి తెచ్చుకుంటాడే తప్ప, తనంతట తాను ఎవరికైనా లొంగిపోవటం రామోజీ రావు జీవితంలో ఇంతవరకు జరగలేదు. 

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రామోజీరావును తన దారిలోకి తెచ్చుకోవాలని అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమై ఆ తరువాత అతన్ని అన్ని రకాల వేధింపులకు గురిచేయటమే కాకుండా రామోజీరావు ఆర్ధిక మూలాలను దెబ్బతీయటానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా  సఫలంకాలేక పోయాడు. రామోజీ రావు జీవితంలో అత్యంత గడ్డు రోజులు ఎదుర్కొంది ఆ సమయంలోనే అనే విషయం అందరికి తెలిసిందే. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈనాడు పేపర్ కొనవద్దని, ఈటివి చూడవద్దని బహిరంగంగా ఎన్నోసార్లు ప్రకటించిన సిగ్గుమాలిన వెధవ రాజశేఖరరెడ్డి. 

జగన్ తన సాక్షి మీడియాలో  రామోజీరావు గురించి, ఈనాడు పేపర్, ఈటివి గురించి ఎన్నో అసత్య వార్తలు రాశాడు, అసభ్య కథనాలు ప్రచారం చేశాడు. జర్నలిజం విలువలకు తిలోదాకాలిచ్చి సంస్కారం మరచి రామోజీరావు పై నీచమైన వ్యాఖ్యానాలెన్నో చేశాడు. తన తండ్రికంటే నీచంగా, సంస్కార హీనంగా జగన్ రామోజీరావు పట్ల ప్రవర్తించాడు. ఇవన్ని అంత త్వరగా మర్చిపోయే విషయాలు కావు.


రామోజీరావుతో మోహన్ బాబుకు అత్యంత సాన్నిహిత్యం ఉంది, మోహన్ బాబు సినిమాలు తన సంస్థ ద్వారా పంపిణీ చేయటమే కాకుండా,  సినిమా నిర్మాణ సమయంలో ఎన్నో సార్లు మోహన్ బాబుకు అన్ని రకాల ఆర్ధిక సహాయం కూడా చేశాడు. ఎన్టిఆర్ కు రికమండ్ చేసి మోహన్ బాబు కు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించటంలో రామోజీరావు హస్తం ఉందని చెప్పుకుంటారు. ఇప్పటికీ మోహన్ బాబుకు రామోజీ రావు అంటే ఎంతో అభిమానం. జగన్ తో బంధుత్వం ఉన్న మోహన్ బాబు రామోజీ విషయంలో మూర్ఖంగా ప్రవర్తిస్తే జగన్ కు నష్టమే తప్ప లాభం ఉండదని, ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి మోడికి అత్యంత సన్నిహితుడు రామోజీరావును ఎదిరించిన వారెవరైనా తుదకు నష్టపోవటమో లేక లొంగి పోవటమో తప్పదని సోదాహరణలతో సహా జగన్ కు వివరించి, ప్రత్యర్ధి బలవంతుడైనప్పుడు యుద్ధం చేసి ఓడిపోవటంకంటే, గౌరవప్రదంగా సంధి చేసుకుంటే పరువు నిలుస్తుందని, రామోజీరావు వ్యాపార ప్రత్యర్దే తప్ప, రాజకీయ ప్రత్యర్ధి కాదని, అతనితో సంధి చేసుకుంటే పోయేదేమీ లేదని, ఇప్పటికైనా సమయం మించి పోలేదని సలహా ఇచ్చి రామోజీ, జగన్ మద్య రాయబారం నడిపి జగన్ ను రామోజీ దగ్గరకు పంపించాడు. తనకు అత్యంత ఆప్తుడు తన వ్యాపారాల్లో, కేసుల్లో భాగస్వామి, ముఖ్య సలహాదారు విజయసాయి రెడ్డి కూడా ఈ ప్రతిపాదనను బలపర్చటంతో తనకు  ఇష్టం లేకపోయినా, కష్టమైనా, కాలం కలిసిరాని పరిస్థితుల్లో జగన్ రామోజీరావుతో సంధి కోసం అతని ఇంటికి వెళ్లి కలిసాడే తప్ప ఇందులో ఎటువంటి రాజకీయాలు, బేరసారాలు లేవని తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి. 

No comments:

Post a Comment