Sunday 11 January 2015

రూటు మార్చిన కెసిఆర్!

Picture
గతంలో తెలంగాణా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో కమ్మ సామాజిక వర్గాన్ని, ఆ సామాజిక వర్గ నాయకులను తీవ్రంగా విమర్శించిన కెసిఆర్, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 'ఆంధ్రోళ్లు' ఆక్రమించుకున్న ఎమ్మార్ ప్రాపర్టీస్, అయ్యప్ప సొసైటీ భూములను స్వాధీనం చేసుకుంటామని, లగడపాటి రాజగోపాల్ లాంకో హిల్స్ అంతు చూస్తామని, రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దున్నిస్తానని కారు కూతలు కూసి తెలంగాణా ప్రజలను 'ఆంధ్ర ప్రాంత సెటిలర్స్' కు వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు. తెరాస అధికారంలోకి వచ్చిన మొదట్లో కూడా ఆ విమర్శల ప్రవాహానికి అంతే లేకుండా పోయింది.

తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 'అయ్యప్ప సొసైటీ' గురుకుల్ ట్రస్ట్ భుముల్లోని కట్టడాలపై, గోకుల్ ప్లాట్స్ కట్టడాలపై దృష్టి సారిస్తే తెలంగాణా ప్రజలు నిజంగానే కెసిఆర్ ఏదో పొడిచేస్తాడు అని భ్రమించారు. కాని వాస్తవంగా అక్కడున్న అక్రమ కట్టడాల్లో కెసిఆర్ కుటుంబ సభ్యులకు, ఆ పార్టీ వారివే కాక తెలంగాణా ప్రాంతానికి చెందినవారివి కూడా అనేక భవనాలున్నాయి. ఈ కారణంతోనే నాగార్జున, బుట్టా రేణుక మొదలైన వారి దగ్గరనుండి భారీగా ముడుపులు పుచ్చుకుని అక్రమ కట్టడాల కూల్చివేతలు నిలిపివేశారు. లాంకో హిల్స్ వైపు కన్నెత్తి చూడకుండా లగడపాటి రాజగోపాల్ కెసిఆర్ ను డబ్బెట్టి కొట్టినట్లు భోగట్టా! అందుకే కనీసం లాంకో హిల్స్ గురించి మాట్లాడే ప్రయత్నం కూడా కెసిఆర్ చెయ్యలేదు.

అధికారంలోకి వచ్చిన తరువాత రెండు, మూడు నెలలకు గాని కెసిఆర్ కు అసలు రాజకీయం అంతుబట్టింది. తెలంగాణా రాష్ట్రంలో కరెంట్ కొరత, మూత పడుతున్న చిన్న పరిశ్రమలు, కుంటుపడుతున్న భవన నిర్మాణ రంగం, ఉపాధి కోల్పోతున్న శ్రామికులు... కెసిఆర్ ను కలవరపెట్టాయి.

తెలంగాణా రాష్ట్రంలో భారీ, మధ్య తరహా పరిశ్రమల్లో 90% పైగా ఆంధ్ర ప్రాంత పారిశ్రామికవేత్తలు స్థాపించినవే! అందులోనూ మరీ ముఖ్యంగా కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల వారు స్థాపించిన పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి. భవన నిర్మాణ రంగంలో కూడా ఈ రెండు వర్గాలవారి సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. చిత్ర నిర్మాణ రంగంలో ఆంధ్ర ప్రాంతం వారిదే పూర్తి ఆధిపత్యం... ఈ రంగం పై ఆధారపడి 30,000 పైగా కుటుంబాలు హైదరాబాద్ లో బతుకుతున్నాయి.

ఏ రాష్ట్రమైనా పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహాలిచ్చి తమ రాష్ట్రానికి ఆహ్వానిస్తుంది కానీ, ప్రాంతీయ విద్వేషాలతో ఉన్న పరిశ్రమలను తమ రాష్ట్రము నుండి బయటకు పంపే సాహసం చేయలేదు, ఆలస్యంగానైనా ఈ విషయం గ్రహించిన కెసిఆర్ తన మొండితనాన్ని, అహంభావాన్ని పక్కనపెట్టి 'ఆంధ్రోళ్ళను' మచ్చిక చేసుకునే కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ముందుగా రామోజీరావును ప్రసన్నం చేసుకుని, ఆయన్ను పొగడటం ద్వారా 'ఆంధ్ర ప్రాంతం' వారికి, ఆయన సామాజికవర్గం వారికి తను వారికి వ్యతిరేకం కాదని సందేశం పంపాడు. లోపాయకారీగా కెసిఆర్ తో మంచి సంబంధాలు కలిగి ఆ పార్టీకి భారీగా విరాళాలిచ్చే రామోజీరావు అందరికంటే ముందుగానే 'ఈనాడు తెలంగాణా' ఛానల్ పెట్టి అంతకుముందే కెసిఆర్ కు బాగా దగ్గరయ్యాడు.

కమ్మ సామాజిక వర్గాన్ని కెసిఆర్ దగ్గర చేసుకోవటానికి మరో ముఖ్య కారణం... తెలంగాణా రాష్ట్రంలో కనీసం 40 అసెంబ్లీ స్థానాల్లో ఆ వర్గం వారు తమ ప్రభావాన్ని చూపే శక్తి కలిగి ఉండటం, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కనీసం 20 కార్పొరేషన్ స్థానాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉండటం వంటి రాజకీయ అంశాలు కూడా కెసిఆర్ ను ఆ వర్గం వారిపట్ల తన వ్యతిరేక భావాన్ని పునరాలోచించుకోనేలా చేశాయి.  ఇదే సమయంలో 'తెలంగాణా రాష్ట్రంలో తనకు ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న రెడ్డి సామజిక వర్గం వారు తెలంగాణలో ఆర్ధికంగా బలమైన కమ్మ సామాజిక వర్గంతో చేతులు కలిపితే భవిష్యత్తులో తనకు రాజకీయంగా ఎంతో నష్టం అని భావించిన కెసిఆర్ కమ్మ వారికి దగ్గరయ్యేందుకు 'రామోజీరావు' ద్వారా పావులు కదిపి కొంతవరకు సఫలీకృతుడయ్యాడు.

గతంలో తను తీవ్రంగా విమర్శలు చేసిన వెంకయ్యనాయుడుతో సంధి చేసుకున్నాడు... మరో కేంద్రమంత్రి సుజనా చౌదరికి చెందిన హైదరాబాద్ లోని ఆస్థులకు అభయమిచ్చాడు. సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్. నూతలపాటి వెంకటరమణ పట్ల తన అపారమైన భక్తి చాటుకున్నాడు. ఎమ్మెల్యే కాదుకదా కనీసం ఎమ్మెల్సీ కూడా కాని 'తుమ్మల నాగేశ్వరరావు' కు మంత్రివర్గంలో కీలకమైన పదవి కట్టబెట్టి 'కమ్మ' సామాజిక వర్గం వారి పట్ల మారిన తన వైఖరిని బహిరంగంగానే చాటుకున్నాడు.

మొండి వాడైన కెసిఆర్ తన వైఖరిని ఈ విధంగా మార్చుకోవటం నిజంగా ఆహ్వానించదగిన పరిణామమే! ఇకనైనా 'ఆంధ్ర ప్రాంతం' వారి పట్ల, 'ఆంధ్ర సెటిలర్స్' పట్ల తన సంకుచిత, రెచ్చగొట్టే వైఖరి మార్చుకుని స్నేహ భావం పెంపొందించుకుంటే అది తనకు, తెలంగాణా ప్రజలకు మంచిదని కెసిఆర్ గ్రహించాలి. 

No comments:

Post a Comment